Tuesday, May 13, 2025
Homeతాజా వార్తలుడ్రంక్ అండ్ డ్రైవ్ లో 24 మందికి జైలు శిక్ష ..

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 24 మందికి జైలు శిక్ష ..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 22  మందికి జరిమాన విధించి 24 జైలు శిక్ష పడిందని నిజామాబాద్ ఏసీబీ రాజా వెంకటరెడ్డి మంగళవారం తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాదారులు మద్యం త్రాగి వాహనాలునడుపడం వలన 46 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మే 13న నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలలో పలు పోలీస్ స్టేషన్ల వారిగా పట్టుబడిన వారికి సంబంధింత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి, వారిని మంగళవారం ఉదయం మార్నింగ్ కోర్టులో హజరు పర్చగా వారికి నూర్జహన్ బేగం స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేటు 22 మందికి జరిమానా విధించగా 24 మందికి జైలు శిక్ష పడిందని తెలిపారు. ఈ సందర్భంగా ఏసిపి రాజా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలను నడపకూడదని సూచించారు. మద్యం సేవించి వాహనాలు పడితే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా వాహనాలు నడిపే వాహనదారులు తప్పకుండా వాహనాలకు సంబంధించిన ధ్రువ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. తప్పనిసరిగా పోలీస్ శాఖ సూచించిన పాటించాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -