Monday, October 27, 2025
E-PAPER
Homeజిల్లాలుజడ్చర్లలో 241 గ్రాముల గంజాయి స్వాధీనం

జడ్చర్లలో 241 గ్రాముల గంజాయి స్వాధీనం

- Advertisement -


నలుగురు గంజాయి నిందితులు అరెస్ట్

నవతెలంగాణ- జడ్చర్ల
గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మహబూబ్‌నగర్ RNCC యూనిట్, ఈగల్ టీం, జడ్చర్ల పోలీసుల సంయుక్తంగా మాచారం గ్రామం (NH–44 హైవే వద్ద) జడ్చర్ల టౌన్ PS పరిధి నందు గంజాయి విక్రయంపై ప్రత్యేక దాడి నిర్వహించింది. దీంట్లో భాగంగా అబ్దుల్ రెహమాన్ టీ స్టాల్ వద్ద అనుమానాస్పదంగా పారిపోతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. విచారణలో వారు గంజాయి కొనుగోలు, విక్రయ కార్యకలాపాలలో పాల్గొన్నట్లు తేలింది.

నిందితుల మరికంటి సుమంత్ రెడ్డి, తండ్రి  పురుషోత్తం రెడ్డి, వృత్తి: విద్యార్థి & మేనేజర్ (వివేద రెస్టారెంట్, షాద్నగర్), మాచారం గ్రామం,  అబ్దుల్ రెహమాన్, తండ్రి మక్బుల్ అహ్మద్ వృత్తి: టీ షాప్ బిజినెస్, రామయ్య బోలి, మహబూబ్‌నగర్ శుభోద్ కాంత్ శర్మ, తండ్రి గిరిజ నందన్ తివారి, వృత్తి: సెక్యూరిటీ గార్డ్, మజహివాన్ గ్రామం, భోజపూర్ జిల్లా, బీహార్ రాష్ట్రం. సత్తు యాదవ్ కుమార్ తండ్రి శుభోద్ కాంత్ శర్మ వృత్తి: సూపర్వైజర్, భవానీపూర్ గ్రామం, శిపోల్ జిల్లా, బీహార్ రాష్ట్రం.వీరు గంజాయి నీ బీహార్ రాష్ట్రం నేపాల్ సరిహద్దుల్లో నుండి కొనుగోలు చేసి హైదరాబాద్ షాద్నగర్ బాలనగర్ ప్రాంతాలలో ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండటంతో అక్కడ కార్మికులకు గంజాయి ప్యాకెట్ల రూపంలో చేసి క్రయ విక్రయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది.

  జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్ Cr.Num 802/2025 u/s  8(c) r/w  20(b)(ii)(A) NDPS act కింద కేసు నమోదు చేయడం జరిగింది, వారినుంచి మొత్తం 241 గ్రాముల గంజాయి మరియు 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 10 వేల రూపాయలు ఉంటుంది అన్నారు నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ.. “జిల్లాలో అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారంపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తారు. గంజాయి వ్యాపారం లేదా వినియోగం వంటి నేర కార్యకలాపాలకు ఎవరూ పాల్పడకూడదు. యువత భవిష్యత్తును కాపాడే దిశగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు.” అని తెలిపారు.గంజాయి వ్యాపారాన్ని అరికట్టడంలో చూపిన అప్రమత్తతకు RNCC యూనిట్, ఈగల్ టీం మరియు జడ్చర్ల పోలీస్ ఎస్ ఐ ఖాదర్, కానిస్టేబుల్ లు విష్ణు, భరత్, నరసింహ, కాశీనాథు, వీరేశ్ లని జిల్లా ఎస్పీ  డి. జానకి,  ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -