నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లా మాధ్ అటవీ ప్రాంతంలో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో సుమారు 25 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అబూజ్‌మడ్ అడవులు, నారాయణ పూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల పరిధిలో మావోయిస్టు అగ్రనేతలు సమావేశమయ్యారనే సమాచారం మేరకు సుమారు 2 వేల మంది డీఆర్జీ జవాన్లు రంగంలోకి దిగాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈక్రమంలో మాధ్ అటవీ ప్రాంతంలో వారికి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎదురుపడగా.. ఇరు వర్గాల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ క్రమంలోనే డీఆర్జీ జవాన్లు మావోయిస్ట్ అగ్రనేతలను చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది. జరిగిన ఎన్‌కౌంటర్ సుమారు 25 మంది మావోయిస్టులు తీవ్రమైన బుల్లెట్ గాయాలతో ప్రాణాలు కోల్పోయినట్లుగా విశ్వనీయ సమాచారం.
ఛత్తీస్‌గఢ్‌లో 25 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్
- Advertisement -
- Advertisement -