వచ్చే ఏడాదిలో విక్రయం
కేంద్రం ప్రణాళిక
న్యూఢిల్లీ : దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్ దిగ్గజం, ప్రభుత్వ రంగ రుణదాత అయిన ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్)లో మోడీ సర్కార్ 25 శాతం వరకు వాటాలను ఉపసంహరిచుకోవాలని యోచిస్తోంది. వాటాల విక్రయాన్ని పర్యవేక్షించే మంత్రుల కమిటీ తుది ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ పరిమాణాన్ని నిర్ణయిస్తుందని అధికారులు తెలిపినట్లు ఫైనాన్సియల్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనంలో వెల్లడిం చింది. సెబీ పబ్లిక్ వాటా నిబంధనలను చేరుకోవడానికి ఈ వాటాల ఉపసంహరణను చేపడుతున్నట్టు కేంద్రం ఓ సాకుగా పేర్కొంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026 -27లో ఐఐఎఫ్‌సీఎల్‌లోని 25శాతం వాటాలను విక్రయిం చడానికి చురుకుగా కసరత్తు జరుగుతోంది. ఈ ఇష్యూలో మూలధన పెట్టుబడి కోసం పది శాతం, తాజా ఈక్విటీ, ప్రభుత్వం ద్వారా మరో 15 శాతం వాటాల విక్రయం ఉండవచ్చు. అదే జరిగితే ఇటీవల కాలంలో ప్రభుత్వం చేపట్టే మరో ప్రధాన డిజిన్వెస్ట్‌మెంట్‌గా నిలిచిపోనుంది.
క్యాబినెట్ ఆమోదం..
ఐఐఎఫ్‌సీఎల్ లిస్టింగ్ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందనిఆ వర్గాలు తెలిపాయి. డిజిన్వెస్ట్‌మెంట్ సన్నాహక పనులు పూర్తయిన తర్వాత 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ ఉండే అవకాశం ఉంది. ఈ సంస్థలో కార్పొరేట్ గవర్నెన్స్‌ను బలోపేతం చేయడం, బడ్జెట్ మద్దతుపై ఆధారపడకుండా విస్తరణ కోసం తాజా మూలధనాన్ని సేకరించేందుకు వీలు కల్పించాలనే లక్ష్యంతో వాటాల ఉపసంహరణ చేపడుతు న్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఐఐఎఫ్‌సీఎల్, రవాణా, ఇంధనం, నీరు, పారిశుధ్యం, పట్టణ రంగాలలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు దీర్ఘకాలిక ఆర్థిక సహాయాన్ని అందించడానికి 2006లో స్థాపించారు.
మెరుగైన ఆర్థిక పనితీరు..
గత ఐదేండ్లలో ఐఐఎఫ్‌సీఎల్ స్థిరమైన వృద్ధిని సాధించింది. ఆర్థిక సంవత్సరం 2019-20లో రూ.9,337 కోట్ల వార్షిక రుణాలను జారీ చేయగా.. 2024-25 నాటికి రూ.51,124 కోట్లకు చేరింది. మొత్తంగా 2025 మార్చి 31 నాటికి రూ.3.06 లక్షల కోట్ల రుణాలు జారీ చేసింది. గడిచిన ఐదేండ్లలో లాభాల్లోనూ భారీ వృద్ధిని సాధించింది. 2019-20లో రూ.51 కోట్ల నికర లాభాలను నమోదు చేయగా.. 2024-25లో ఏకంగా రూ.2,165 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇదే సమయంలో ఆ సంస్థ స్థూల నిరర్థక ఆస్తులు 19.7 శాతం నుంచి ఏకంగా 1.11 శాతానికి పడిపోయాయి. నికర ఎన్‌పీఏలు 9.75 శాతం నుంచి 0.35 శాతానికి తగ్గాయి.
ఐఐఎఫ్‌సీఎల్‌లో 25 శాతం డిజిన్వెస్ట్‌మెంట్..!
- Advertisement -
- Advertisement -


