శంషాబాద్: ఇజ్రాయిల్- ఇరాన్ దేశాల్లో యుద్ధ మేఘాలు అలముకోవడంతో అంతర్జాతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఆదివారం కువైట్, అబుదాబీ, మస్కట్, షార్జా, బహ్రెయిన్, రియాద్, దమ్మామ్, జెడ్డా, మదీనా, దోహా, దుబాయ్ నగరాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన 26 అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆయా విమానాశ్రయాల్లోనే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగిస్తున్న అంతర్జాతీయ విమాన సర్వీసులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు, వాహనాల రద్దీ బాగా తగ్గింది. ఆయా దేశాల్లో ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాతనే గల్ఫ్ దేశాల విమాన సర్వీసులు పున్ణప్రారంభం అవుతాయని విమానాశ్రయం అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్‌కు రావాల్సిన 26 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



