Thursday, March 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాను వీడితే 2,600 డాలర్లు

అమెరికాను వీడితే 2,600 డాలర్లు

- Advertisement -

– అక్రమ వలసదారులకు ఆఫర్‌
– విమానంలో ఉచితంగా వారి స్వదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు
– హౌమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం

వాషింగ్టన్‌: స్వచ్ఛందంగా అమెరికాను వదిలివెళ్లే అక్రమ వలసదారులకు 2,600 డాలర్లు (రూ.2,40,329) ఎగ్జిట్‌ బోనస్‌ అందించనున్నట్టు ట్రంప్‌ యంత్రాంగం ప్రకటించింది. దీంతోపాటు వారి స్వదేశాలకు విమానంలో ఉచితంగా పంపించడానికి ఏర్పాట్లు చేస్తామని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. తాము స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమేనని ‘సీబీపీ హోమ్‌’ యాప్‌ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే వారి పేర్లను బలవంతంగా స్వదేశానికి తరలించాల్సిన వారి లిస్టు నుంచి తొలగిస్తామని తెలిపింది.

అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపడానికి 2025 జనవరిలో అమెరికా చర్యలు ప్రారంభించినట్టు హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం పేర్కొంది. తాము ఇస్తున్న ఆఫర్‌లను వినియోగించుకొని.. ఇప్పటివరకు 22 లక్షల మందికిపైగా అక్రమ వలసదారులు తమ దేశాలకు తిరిగివెళ్లినట్టు వెల్లడించింది. స్వచ్ఛందంగా స్వదేశానికి తిరిగి వెళ్లడమే అక్రమంగా అమెరికాకు వచ్చినవారి ముందున్న అతి సురక్షితమైన, చవకైన మార్గమని తెలిపింది. అలా చేస్తే అరెస్టు కాకుండా కూడా ఉండొచ్చని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -