నవతెలంగాణ – ఢిల్లీ: పహల్గామ్‌లో పాశవిక దాడితో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ దాడి తర్వాత బిహార్‌లో జరిగిన ఓ ప్రజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. తొలిసారి పహల్గామ్ ఉగ్రదాడిపై నేరుగా స్పందించారు. అమాయకులైన ప్రజలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను వారు కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంది. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతిఒక్కరిలోనూ బాధ, ఆగ్రహం ఉన్నాయి. ఈ ఉగ్రదాడి వెనుక ఉన్నవారు.. ఇందులో భాగమైన వారికి ఊహకందని రీతిలో శిక్ష విధిస్తాం. ఉగ్రమూకల వెన్నెముకను 140 కోట్ల మంది భారతీయులు విరిచేస్తారు. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు యావత్ భారత్ దృఢ సంకల్పంతో ఉంది.
ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES