రాయ్ పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో బుధవారం ఉదయం 29మంది మావోయిస్టులు లొంగిపోయారు. సీపీఐ(మావోయిస్ట్) ఫ్రంట్ వింగ్‌లై న సంస్థల్లో క్రియాశీకలంగా ఉన్న పలువురు కార్యకర్త లు, సభ్యులు సహా 29మంది మావోయిస్టులు సీఆర్‌పీఎఫ్, సీనియర్ అధికారుల ఎదుట లొంగిపో యారని సుక్మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ ఒక ప్రకటనలో తెలిపారు. గోగుండ ప్రాంత ంలోని దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంగ్దా న్ (డీఏకే ఎంఎస్) అధ్యక్షుడు పోదియం బుద్రా, ఇత ర కార్యకర్తలు, జనతన సర్కార్ విభాగాల సభ్యులు సహా పలువురు ఉన్నారని అన్నారు. పోదియం బుద్రా తలపై రూ.2లక్షల రివార్డు ఉందని అన్నారు. 2026 జనవరి7న సుక్మాలో 26మంది మావోయి స్టులు, 8వ తేదీన పొరుగున ఉన్న దంతెవాడ జిల్లాలో 63మంది మావోయిస్టులు లొంగిపోయిన సంగతి తెలిసిందే. 2025లో రాష్ట్రవ్యాప్తంగా 1500 మందికిపైగా మావోయిస్టులు లొంగిపోయారు.
సుక్మా జిల్లాలో 29మంది మావోయిస్టుల సరెండర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



