- Advertisement -
నవతెలంగాణ- నవీపేట్: అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ బియ్యంను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అశోక్ లేలాండ్ వాహనంలో వెళుతున్న పిడిఎఫ్ బియ్యాన్ని పట్టుకొని ఎన్ఫోర్స్మెంట్ డిటీ మహేష్ కుమార్ కు సమాచారం ఇవ్వగా ఆయన పంచనామా నిర్వహించగా 29 క్వింటాళ్ల పిడిఎఫ్ బియ్యం అక్రమంగా మహారాష్ట్ర ధర్మాబాద్ కు తరలిస్తున్నట్లు నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని మాలపల్లికి చెందిన డ్రైవర్ సోఫియాన్ , నిజామాబాద్ కు చెందిన యజమాని షేక్ ఖయ్యూంలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా పిడిఎస్ బియ్యం తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.
- Advertisement -