Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్మెడికవర్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో 2కె రన్

మెడికవర్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో 2కె రన్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్
 హైపర్ టెన్షన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ఆస్కారం ఉందని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. సరైన సమయంలో వైద్యుల సూచన మేరకు మందులు వాడడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని వారు సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట చౌరస్తా సమీపంలో గల మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికవర్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సురేష్ జాజు జెండా ఊపి ప్రారంభించారు.ఈ అవగాహన ర్యాలీ ఎల్లమ్మ గుట్ట చౌరస్తా ఎన్టీఆర్ చౌరస్తా కోర్టు చౌరస్తా మీదుగా పులాంగ్ చౌరస్తా నుండి కొనసాగింది.. ఈ సందర్భంగా ప్రముఖ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ రావు మాట్లాడుతూ ..హైపర్ టెన్షన్ పై అవగాహన కోసం నిజామాబాద్ నగరంలోని మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించడం శుభపరిణామం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మే 17న ప్రపంచ హైపర్ టెన్షన్ డే (బీపి దినోత్సవం)ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైపర్ టెన్షన్ డే రోజున ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో యువత పెద్దలు ప్రతి ఒక్కరూ సమయానికి ఆహారం తీసుకోవడం అసలు ఆరోగ్యం పట్ల పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమయాన్నికూలంగా భోజనం తీసుకోకపోవడం, వ్యాయామం యోగా ధ్యానం లాంటివి చేయకపోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే గతంలో 50 నుంచి 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈ వ్యాధి బారిన వాడే పరిస్థితులు ఉండేవి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 25 నుంచి 30 సంవత్సరాలకి ఈ వ్యాధి భారిన యువత పడుతున్నారన్నారు.. అయితే ఈ వ్యాధి పట్ల నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో వహించరాదని సూచించారు. వైద్యుల సలహాలు సూచనల మేరకు బీపీ చెక్ చేసుకోవడంతో పాటు మందులను వాడాలని సూచించారు. ఒకవేళ మందుల వాడకంలో ఆహారపు అలవాట్లు నిర్లక్ష్యం వహిస్తే గుండెపోటు పక్షవాతం లాంటి దీర్ఘకాలిక ప్రాణాపాయ స్థితికి సంబంధించిన వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని తెలిపారు… ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రతి వంద మందిలో బీపీ ఉన్నట్లు, 50 మంది మాత్రమే తెలుసని అన్నారు. సాధారణంగా బీపీ అనేది కొందరే పరీక్షించుకోవాలని ప్రజల్లో అపోహ ఉందని పేర్కొన్నారు. ఈ అవగాహన ర్యాలీలో ప్రముఖ ఓపెన్ హార్ట్ సర్జన్ డాక్టర్ అవిన్ సనార్, న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య,నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అజయ్ కుమార్ విశ్వనాథ్ పాటిల్,జనరల్ సర్జన్ డాక్టర్ మనోజ్,డా. యజ్ఞ,సెంటర్ హెడ్ స్వామి, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -