– పాల్గొన్న సీఐ నాగరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం అశ్వారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన టూ కే రన్ –  ఐక్యతా పరుగు విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన సీఐ నాగరాజు మాట్లాడుతూ జాతీయ ఐక్యతా దినోత్సవ సందర్భంగా చేపట్టిన ఈ పరుగు సుప్రభాత కిరణంలా జాతి ఖ్యాతి నిలపాలని, గెలుపు తలుపు తెరవాలని, ఐక్యతకు అర్ధం గా నిలవాలని, సమైఖ్యతే జాతి సిరి గా చెప్పాలని, ఉక్కు మనిషి స్పూర్తే భరత మాతకు అలంకరణ కావాలని విద్యార్ధిని విద్యార్ధులకు సూచించారు.
అనంతరం స్థానిక మూడు రోడ్ల ప్రధాన కూడలి నుండి రెండు కిలో మీటర్లు వరకు పరుగు తీసారు. ఈ కార్యక్రమంలో ఎస్.హెచ్.ఓ ఎస్ఐ యయాతి రాజు,పోలీస్ సిబ్బంది,వ్యవసాయ కళాశాల,ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్ధులు,తదితరులు పాల్గొన్నారు.

 
                                    