నవతెలంగాణ – చండూరు
మండలంలోని 10 గ్రామాలకు గ్రామపంచాయతీలకు సంబంధించిన నూతన వార్డు సభ్యులకు సోమవారం 2 వా బ్యాచ్ శిక్షణ తరగతులను ఎంపీడీవో బండారు యాదగిరి ప్రారంభించారు. ఇందులో భాగంగా శిక్షణ అధికారులు వార్డు సభ్యులకు గ్రామ పాలనలో వ్యవస్థలు, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీలకు అధికారాలు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు బాధ్యతలు, ప్రాథమిక లక్ష్యాలు, నాయకత్వ లక్షణాలు, పారిశుధ్యం, సమావేశాలు, స్టాండింగ్ కమిటీల ఏర్పాటు, వన మహోత్సవం, నిధులపై ఆడిట్, ప్రజా ఆరోగ్యం, జనన, మరణాల నమోదు, ఈ-అప్లికేషన్, ఆర్థిక ప్రణాళిక తదితర 24 అంశాలపై శిక్షణ, చట్టాన్ని అతిక్రమిస్తే సర్పంచులపై ఎలాంటి చర్యలు ఉంటాయనే విషయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ కోటేష్ , శిక్షణ అధికారులు సంధ్య, శ్రీకాంత్, గీతంజలి, రాజేందర్ రెడ్డి,ఉప సర్పంచులు, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వార్డు సభ్యులకు 2వ బ్యాచ్ శిక్షణా తరగతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



