Sunday, May 4, 2025
Homeరాష్ట్రీయంశంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 3.5 కిలోల బంగారం పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 3.5 కిలోల బంగారం పట్టివేత

- Advertisement -

నవతెలంగాణ-శంషాబాద్‌
శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. డీఆర్‌ఐ, హెచ్‌జడ్‌యు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబారు నుంచి మస్కట్‌ మీదుగా హైదరాబాద్‌- శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ భారతీయ ప్రయాణికుడి వద్ద 3500 గ్రాముల 30 బంగారపు బిస్కెట్లు అధికారులు గుర్తించారు. బంగారాన్ని విమానాశ్రయంలోని అంతర్జాతీయ ప్యాసింజర్స్‌ అరైవిల్‌ గేటు ఏరోబ్రిడ్జ్‌ వద్ద ఉన్న గ్రౌండ్‌ హ్యాండిలింగ్‌ సిబ్బందికి అందిస్తుండగా డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. అయితే, నిందితుడు బంగారాన్ని మొదటగా అంతర్జాతీయ ప్యాసింజర్స్‌ అరైవిల్‌ వద్ద గ్రౌండ్‌ హాండ్లింగ్‌ సిబ్బందికి చేరవేసి కస్టమ్స్‌ అధికారులను తప్పించుకొని బయట పార్కింగ్‌ వద్ద వేచి ఉన్న రెండో గ్రౌండ్‌ సిబ్బందికి ఇస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి బయట పార్కింగ్‌ వద్ద దుబారు నుంచి బంగారాన్ని తీసుకొచ్చిన అతనికి అందజేస్తాడు. అయితే, ఇదంతా ముందుగానే పసిగట్టిన డీఆర్‌ఐ అధికారులు విమానాశ్రయంలోని పార్కింగ్‌ వద్ద బంగారాన్ని మార్చుకుంటూ ఉండగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ప్యాకింగ్‌ చేసిన 30 బంగారపు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన బంగారం దాదాపు 3,500 గ్రాములు ఉంటుందని, దాని విలువ రూ.3 కోట్ల 45లక్షల 79వేల 300 ఉంటుందని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -