Friday, July 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసర్కారు బడుల్లో 3.68 లక్షల మందికి ప్రవేశం

సర్కారు బడుల్లో 3.68 లక్షల మందికి ప్రవేశం

- Advertisement -

– ప్రీప్రైమరీలో 6,146 మంది, 1వ తరగతిలో 1.38 లక్షల మంది చేరిక్ణ్ణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025-26 విద్యాసంవత్సరంలో 3,68,054 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. ఇందులో 572 ప్రీప్రైమరీ పాఠశాలల్లో 6,146 మంది పిల్లలు చేరారు. ఒకటో తరగతిలో 1,38,135 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. రెండు నుంచి పదో తరగతి వరకు 2,29,919 మంది విద్యార్థులు చేరారు. ఇందులో ప్రయివేటు పాఠశాలల నుంచి సర్కారు బడుల్లో 79,048 మంది, ప్రభుత్వ స్కూళ్ల నుంచి సర్కారు పాఠశాలల్లో 1,50,819 మంది చేరారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో మొత్తం 3,68,054 మంది ప్రవేశాలు పొందారు. గత విద్యాసంవత్సరంలో సర్కారు బడుల్లో 2,00,901 మంది చేరినట్టు తెలిసింది. దీంతో ప్రస్తుత విద్యాసంవత్సరంలో గతేడాది కంటే 1,67,153 మంది విద్యార్థులు పెరిగారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు విద్యార్థులకు చేరినట్టు విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. రెండు జతల ఉచిత యూనిఫారాల పంపిణీలో ఒక జత విద్యార్థులకు పంపిణీ చేసినట్టు వివరించారు. రెండో జత ఈనెలాఖరులోగా ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందుకు సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -