Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్3 నిమిషాలు ఆలస్యం..అనుమతి నిరాకరణ

3 నిమిషాలు ఆలస్యం..అనుమతి నిరాకరణ

- Advertisement -

బోరుణ విలపించిన విద్యార్థిని వైష్ణవి, ఆమె తల్లి.. 
లోనికి అనుమతించని అధికారులు..
నవతెలంగాణ – వేములవాడ 
: సంవత్సరం పాటు కష్టపడి చదువుకొని పరీక్ష రాసే సమయంలో 3 నిమిషాలు ఆలస్యమైందని, విద్యార్థిని పరీక్ష కేంద్రంలోని అనుమతించకపోవడంతో ఏడుస్తూనే తల్లి కూతురు వెనుతిరిగారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం కరీంనగర్‌లోని ఉమెన్స్ డిగ్రీ పీజీ  కాలేజీలో నీట్ పరీక్ష కేంద్రానికి 3 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని, లోనికి అధికారులు నిరాకరించారు. సంవత్సర కాలంగా విద్యార్థిని వైష్ణవి చదువు కోసం చెవుల కమ్మలు, పుస్తెలతాడు కుదువపెట్టి మరీ.. రూ.2 లక్షల ఖర్చుతో కోచింగ్ ఇప్పించామని తల్లి కన్నీరు మున్నూరుగా విలపించింది. దయచేసి తన కుమార్తెను అనుమతించాలని రోధిస్తూ వేడుకున్నారు. సంవత్సర కాలం వృధా అవుతుందని ప్రాధేయపడ్డారు. ప్లీజ్ సార్ ఒక్క అవకాశం ఇవ్వండన్నా.. ఏమాత్రం లోనికి అనుమతించలేదు. పిల్లల భవిష్యత్తు పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం సరైంది కాదని, పరీక్ష రాయడానికి రెండు గంటల సమయం ఉన్న అనుమతించకపోవడం పేద మధ్యతరగతి విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని అన్నారు. కూలినాలి పనిచేసుకుంటూ నా బిడ్డను చదివిస్తున్నానని, అధికారులకు ప్రాధేయపడిన విద్యార్థిని తల్లి రోదిస్తూ మీడియాకు తెలిపింది. వివిధ హోదాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు సమయపాలన లేకుండా గంటలు ఆలస్యం వచ్చిన చర్యలు తీసుకోరు గానీ, మూడు నిమిషాలు ఆలస్యమైనందుకు రూల్స్ అంటూ విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రూల్స్ ప్రకారం అనుమతించమని చెప్పడంతో ఏడుస్తూనే తల్లి, కూతురు వెనుదిరిగారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad