Thursday, May 1, 2025
Homeఅంతర్జాతీయంమైక్రోసాఫ్ట్‌లో 30 శాతం కోడింగ్‌ ఎఐనే రాస్తోంది: సత్య నాదేళ్ల

మైక్రోసాఫ్ట్‌లో 30 శాతం కోడింగ్‌ ఎఐనే రాస్తోంది: సత్య నాదేళ్ల

న‌వతెలంగాణ‌- హైద‌రాబాద్‌: కృత్రిమ మేధ (ఎఐ) ద్వారా తమ కంపెనీకి సంబంధించిన 30 శాతం కోడింగ్‌ను రాస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌ సిఇఒ సత్య నాదేళ్ల వెల్లడించారు. కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌లో నిర్వహించిన మెటా లామా ఎఐ డెవలపర్‌ కార్యక్రమంలో నాదేళ్ల మాట్లాడుతూ.. తమ సంస్థకు సంబంధించి 20 నుంచి 30 శాతం కోడ్‌ను ఎఐతోనే రూపొందిస్తున్నట్లు తెలిపారు. నాణ్యత కోసం ఎఐ ఆధారిత టూల్స్‌పై ఆధారపడటం పెరుగుతోందన్నారు. క్రమంగా వీటి వినియోగం అధికమవుతోందన్నారు. ఇటీవలే గూగుల్‌ సిఇఒ సుందర్ పిచాయ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. గూగుల్‌లో జనరేట్‌ చేసిన కోడ్‌ను ఇంజినీర్లు రివ్యూ చేస్తున్నప్పటికీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం పెరిగిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img