– ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్
– కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై కూర్చొని ధర్నా
నవతెలంగాణ-కరీంనగర్
రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని, బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్‌ఎఫ్‌ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై కూర్చొని, ప్లేట్స్ పట్టుకొని ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజురోజుకీ విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం విద్యాశాఖ మంత్రిని కేటాయించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. విద్యార్థులకు మూడేండ్ల నుంచి స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయలేదన్నారు. బీసీ సంక్షేమ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నప్పటికీ సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు వినరు, సాగర్, సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్, భోగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు మానస, సురేష్, సందేశ్, రక్షక్, అక్షరు, నాయకులు రమేష్, సిరివెన్నెల, సన్నీ, నికిల్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



