నవతెలంగాణ-హైదారాబాద్: గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ దాడుల వల్ల ఇప్పటికే వేలాది మంది మృతి చెందారు. అయినప్పటికీ ఇజ్రాయిల్ భూ ఆక్రమణ కోసం పాలస్తీనియన్లను అతిదారుణంగా హతమారుస్తూనే ఉంది. తాజాగా గురువారం తెల్లవారుజామున నుండి మొదలైన ఇజ్రాయిల్ దాడుల వల్ల కనీసం 85 మంది మృతి చెంది ఉంటారని వైద్య వర్గాలు మీడియాకు వెల్లడించాయి. మరోవైపు దాడుల వల్ల మాత్రమే కాదు.. అక్కడ ఆకలి మరణాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఆకలిని తట్టుకోలేక ఇటీవలి కాలంలో 29 మంది చిన్నారులు, ముసలివాళ్లు మృతి చెందారని గాజా ఆరోగ్య మంత్రత్వశాఖ తెలిపింది. ఇంకా వేలాది మంది పాలస్తీనియన్లు ఆకలితో అలమటిస్తున్నారని గాజా ఆరోగ్య మంత్రత్వశాఖ వెల్లడించింది.
ఇజ్రాయిల్ దాడుల్లో 85మంది మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES