Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్317 జీవోను వెంటనే రద్దు చేయాలి

317 జీవోను వెంటనే రద్దు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – మద్దూరు
37 జీవోను వెంటనే రద్దు చేయాలని తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుముల మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మద్దూరు దూల్మిట్ట మండలాల్లోని అన్ని పాఠశాలల్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోను వెంటనే రద్దు చేయాలని, అలాగే పెండింగ్ లో ఉన్న డీఎ లను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వంగ నర్సిరెడ్డి, మండల బాధ్యులు బైరగోని హరిప్రసాద్, ఉపాధ్యాయులు బైరగోని మురళి, కాళీ రవి, నరికే బాల భాస్కర్, బూరుగు కనకయ్య, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -