Tuesday, January 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకుక్కల దాడిలో 32 గొర్రెలు మృత్యువాత

కుక్కల దాడిలో 32 గొర్రెలు మృత్యువాత

- Advertisement -

– 6 గొర్రెలకు తీవ్ర గాయాలు
– సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లిలో ఘటన
నవతెలంగాణ-ములుగు

గొర్రెల మందపై కుక్కలు దాడి చేసిన ఘటనలో 32 గొర్రెలు మృత్యువాత పడగా, మరో 6 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు, బాధిత గొర్రెల కాపరి తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మక్కపల్లికి చెందిన దేవి రవి ఆదివారం సాయంత్రం ఇంటి సమీపంలోని కొట్టంలో గొర్రెలను తోలాడు. సోమవారం తెల్లవారుజామున వీధి కుక్కలు గుంపుగా వచ్చి గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ దాడిలో 32 గొర్రెలు మృత్యువాత పడగా.. 6 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొట్టం వద్దకు వచ్చే సరికి గొర్రెలు మృతిచెంది ఉండటం చూసి రవి కన్నీటిపర్యంతమయ్యాడు. మిగతా 6 గొర్రెలు కూడా బతికే అవకాశం లేదని, సుమారు రూ.2.50 లక్షలకు పైనే నష్టం వాటిల్లిందని వాపోయాడు. ప్రభుత్వం తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -