Saturday, October 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత

హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత

- Advertisement -

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను నాంపల్లి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. రూ.16. 50 లక్షలు విలువ చేసే 33 కేజీల గంజాయిని, రెండు ట్రాలీ సూట్కేసులను, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన  సమావేశంలో రైల్వే పోలీస్ డీఎస్పీ జావెద్, టీజీ న్యాబ్ డీఎస్పీ భిక్షపతిరావు, ఆర్పీఎఫ్ సీఐ కల్పన, ప్రభుత్వ నాంపల్లి పోలీస్ స్టేషన్  ఇన్ స్పెక్టర్ బి.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..  ఒడిశాకు చెందిన కిశోర్ లిమా అనే వ్యక్తిఏజెంట్లను నియమించుకుని ముంబయికి గంజాయి సరఫరా చేస్తున్నాడు.

తాను చెప్పిన ప్రదేశానికి తీసుకెళ్లి అందిస్తే కేజీ గంజాయికి రూ.1000 కమీషన్ ఇస్తాడు. ఈనెల 9న రెండు ట్రాలీ సూట్కేసులలో రూ.16.50 లక్షలు విలువ చేసే 33.058 కేజీల గంజాం జిల్లాకు చెందిన రాజేష్ బిషోయ్ (26), గజపతి జిల్లా అడవ ప్రాంతానికి చెందిన సుజాత సింగ్ (29)లకు ఇచ్చాడు. వారిని కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలులో త్రీటైర్ ఏసీ కోచ్ బుక్ చేసి పంపాడు. శుక్రవారం రైలు బేగంపేట్ రైల్వేస్టేషన్లో దిగి ప్రయాణికుల వెయిటింగ్ హాల్లో వేచి ఉన్నారు. పోలీసులు తనిఖీ చేసి ట్రాలీ సూట్కేసులలో గంజాయిని గుర్తించారు. వారిని అరెస్టు చేయడంతో పాటు గంజాయి సీజ్ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో రైల్వే పోలీసులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -