Sunday, March 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళలకు 33శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి

మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి

- Advertisement -

ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి
రాజన్న సిరిసిల్లలో సభ్యత్వ నమోదు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రునగర్‌లో శనివారం ఐద్వా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ… నిరంతరం మహిళా హక్కుల కోసం పోరాడుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంలో మహిళలందరూ సభ్యులుగా చేరి సంఘం బలోపేతానికి కృషి చేయాలన్నారు. దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతుందనీ ఇంటి నుంచి బయటకు వెళ్తే మళ్లీ ఇంటికి చేరుకునే దాకా ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రతి మహిళ భయపడుతూ జీవిస్తున్న పరిస్థితి దేశంలో ఉందన్నారు.

మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన నిర్భయ చట్టం, లైంగిక వేధింపుల చట్టం, వరకట్నం వేధింపుల చట్టం, గృహహింస చట్టం ఇవి ఏమి మహిళలకు రక్షణ కల్పించడం లేదన్నారు. దేశంలో అధికారిక గణింకాల ప్రకారం గంటకు ఇద్దరు మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నారన్నారు. ప్రతి 26 నిమిషాలకు ఒక మహిళ వేధింపులకు గురవుతుందని తెలిపారు. పని ప్రదేశాల్లో భద్రత లేదనీ, సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జవ్వాజి విమల, సూరం పద్మ, ఆడెపు రజిత, గడప మాధవి, నేల పెళ్లి శ్యామల, గురజాల మమత, మల్లారపు నరసవ్వ, రూప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -