నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల పెంపుతో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. వచ్చే నెల ఆగస్టు 1తో టారిఫ్ గడువు ముగియనునడంతో యూఎస్ తో వాణిజ్యపరంగా ఒప్పందాలు చేసుకొవాలని మేకపోతు గంభీరాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల బ్రెజిల్ దేశ ఎగుమతులపై 50శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
తాజాగా కెనడా దేశం 35శాతం పన్నులు విధిస్తామని ఆదేశ ప్రధాని మార్క్ కార్నీ కి ట్రూత్ సోషల్ వేదికగా ఓ లేఖ పంపించారు. యూఎస్ లోకి అక్రమ వలసదారులను, మాదకద్రవ్యాల సరఫరాను కట్టడి చేయడంలో కెనడా విఫలమైందని, అంతేకాకుండా అమెరికాలో వలసల సంక్షోభం సృష్టించడానికి దోహదం చేస్తుందని ఆ లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. కెనడాకు దిగుమతి అయ్యే యూఎస్ వస్తువులపై ఏ స్థాయిలో సుంకాలు విధిస్తున్నారో..అంతే మొత్తంలో తాము కూడా టారిఫ్ విధిస్తామని తెలిపారు. ఆగస్టు 1 తర్వాత అమెరికాలోకి ఎగుమతి అయ్యే ప్రతి కెనడా వస్తువులపై 35శాతం సుంకాలు వసూలు చేస్తామని, ఈ లోపు యూఎస్‌తో ఓ అంగీకరానికి రావాలని లేఖలో రాసుకొచ్చారు.