– డిమాండ్ మేరకు జిల్లాల్లో పంపిణీ : వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంపై ఒత్తిడితో వారం రోజుల్లో రాష్ట్రానికి 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన యూరియాను తక్షణమే డిమాండుకు అనుగుణంగా జిల్లాలకు పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపిని మంత్రి ఆదేశించారు. కేంద్రం అసమర్థతతో ఇతర దేశాల నుంచి దిగుమతి తెప్పించి, రాష్ట్రాలకు యూరియా సరఫరా చేయడంలో ఘోరంగా విఫలమైందని తెలిపారు. కేంద్ర వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కేంద్రం తరఫున రాష్ట్ర రైతాంగానికి యూరియా సరఫరాలో జరిగిన ఆలస్యానికి చింతిస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే తెప్పించడానికి ఎంత వరకైనా పోరాడుతామని స్పష్టం చేశారు. ఆర్‌ఎఫ్సీఎల్ నుంచి రావాల్సిన యూరియాను తెప్పించడానికి ఇప్పటికే ఆర్‌ఎఫ్సీఎల్ ఎండీతో మాట్లాడినట్టు తెలిపారు. ఇప్పటికే పాత నిల్వలతో కలుపుకొని 7.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించినట్టు వెల్లడించారు.
రాష్ట్రానికి 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES