నవతెలంగాణ-బిచ్కుంద
బిచ్కుంద మండలంలోని ఫత్లాపూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారి పక్కనగల 36 దాబాలో మద్యం విక్రయిస్తూ సిట్టింగులు ఏర్పాటు చేస్తున్నారని గతంలో రెండు సార్లు కేసులు నమోదు చేసారు. యజమాని బలిజ గంగాధర్ ను తహసిల్దార్ వేణుగోపాల్ ముందర బైండ్ డౌన్ చేసి 50 వేల జరిమానా విధించారు. డాబాల్లో మద్యం విక్రయించరాదని సిట్టింగ్లు ఏర్పాటు చేయరాదని హెచ్చరించినప్పటికీ గతంలో జూన్, సెప్టెంబర్ మాసాల్లో మద్యం సిట్టింగులు ఏర్పాటు చేయడంతో రెండు సార్లు కేసులు నమోదు చేసి 50 వేల జరిమానా విధించి తహసిల్దార్ ముందర బైండోవర్ చేయడం జరిగిందని ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. దాబా యజమానులు వారి దాబాలలో మద్యం విక్రయాలు చేపట్టిన, సిట్టింగ్లు ఏర్పాటు చేసి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఒకసారి బైండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్లీ ఇలాంటి కలపాలకు పాల్పడితే జరిమానాతో పాటు శిక్షార్హులు అవుతారని ఎస్సై దాబా యజమానులకు హెచ్చరించారు.
36 దాబా యజమానికి రూ.50 వేల జరిమానా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES