- Advertisement -
నవతెలంగాణ – బిచ్కుంద
బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో న్యాయమూర్తి వినీల్ కుమార్ 365 కేసులను పరిష్కరించారు. ఇందులో బ్యాంక్ సెటిల్మెంట్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల ద్వారా 23లక్షల 67వేల 360రూపాయల సెటిల్మెంట్, జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రకాష్ ,ఏజిపి విట్టల్, న్యాయవాదులు లక్ష్మణరావు, మహమ్మద్, శివాజీ, మనోజ్, కోర్టు సిబ్బంది సుదర్శన్ గౌడ్, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ పోలీస్ సిబ్బంది ఆయా మండలాల వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.
- Advertisement -