– మూడో రోజు కు చేరిన పరీక్షలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు – 2026 శుక్రవారం నాటికి మూడో రోజు కు చేరాయి. పరీక్షా కేంద్రాలు వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీఐ నాగరాజు, ఎస్సై అఖిల లు కేంద్రాల వద్ద ఇద్దరేసి చొప్పున పోలీస్ సిబ్బంది ని నిఘా పెట్టారు. మూడు కేంద్రాల్లో మూడో రోజు మొదటి సంవత్సరం ఆంగ్ల పరీక్ష కు 838 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 800 మంది పరీక్షలకు హాజరు అయ్యారు.38 మంది పరీక్షలకు హాజరు కాలేదు.
మూడు కేంద్రాల డిపార్ట్మెంట్ ఆఫీసర్,సీఎస్ లు కోళ్ళ శ్రీనివాస్,సత్య శ్రీధర్,ఝాన్సీ,సంగీత,రాంబాబు,ఎల్ ఎస్ ప్రసాద్ లు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.
కేంద్రం అలాట్మెంట్ హాజరు గైర్హాజరు
జీజేసీ 365 349 16
జీఎంఆర్ జేసీ 157 154 03
వీకేడీవీఎస్ఆర్ జేసీ 316 397 19
మొత్తం 838 800 38



