సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు
నవతెలంగాణ – అచ్చంపేట
దశాబ్ద కాలం పాటు కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న 29 లేబర్, కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ… కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని టీఎన్జీవో భవనంలో సిఐటియు మండల మహాసభ నిర్వహించారు. సిఐటియు మండల మహాసభ కు కామ్రేడ్ బి.రాములు అధ్యక్షతన వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు హాజరై మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు కావస్తున్న కార్మికులకు ఉద్ధరించింది ఏమీ లేదన్నారు.
కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకొస్తూ…. ఉన్న పరిశ్రమలను మూతవేస్తూ ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేసిందని, కార్మికులను నిరాశ్రయులుగా చేస్తుందన్నారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పాలన చేస్తున్న బిజెపి ప్రభుత్వంపై కార్మికులు ఐక్యమత్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు కుతంత్రాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేయటం లేదని, పెరుగుతున్న ధరల కలిగినంగా కనీస వేతన చట్టాన్ని వెంటనే అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్మికులు అనేక పోరాటాలు చేసి 8 గంటల పని దినాన్ని సాధించుకుంటే…! బిజెపి ప్రభుత్వం 12 గంటలు పనిచేయాలని చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమన్నారు. కార్మికులకు నెలనెలకు జీతాలు ఇవ్వక వాళ్ళ కుటుంబాలు గడవక ఆర్థికంగా చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు శంకర్ నాయక్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేశా నాయక్ , సినియర్ నాయకులు శివకుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మల్లేష్, అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పార్వతమ్మ ,ఏమయ్యా, వెంకటేశు, వెంకటయ్య, అలివేల, జ్యోతి, సైదమ్మ, శివలీల, రేణయ్య, లక్ష్మయ్య, తదితరులు ఉన్నారు.



