- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కరీంనగర్‌లోని ఓ సేటు ఇంట్లో 40 ఓట్లు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిజామాబాద్ పట్టణంలో మహారాష్ట్ర వాసులకు ఓట్లు ఉన్నాయని, ఎంత మందికి రెండు ఓట్లు ఉన్నాయో లెక్కే లేదని అన్నారు. ఓట్ల చోరీతోనే మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చారని పునరుద్ఘాటించారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలవడంపై తమకు అనుమానం ఉందన్నారు.
- Advertisement -