నవతెలంగాణ – ఆలేరు రూరల్ :
నైజాం నవాబు తెలంగాణ ప్రాంతంలో ప్రజలను వెట్టి చాకిరి నుండి విముక్తి కల్పించేందుకు దున్నే వాడికి భూమి కావాలని ఆరుట్ల రామచంద్రారెడ్డి పెద్ద ఎత్తున ప్రజలను నైజాం నిరంకుశ పాలన కు వ్యతిరేకంగా పోరాటం చేసి వేల ఎకరాలు పేదలకు పంచినచరిత్ర ఆయనకు సొంతం (నేటితో)40 సంవత్సరాల క్రితం చనిపోయి అమరజీవిగా ఇప్పటికీ తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం తేడా లేకుండా పేద ప్రజల గుండెల్లో అమరత్వం పొంది అమరజీవిగా ఉన్నాడు. ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా తనతో పాటు తన భార్య కమలాదేవిని కూడా పోరాటాల్లో భాగస్వామ్యం చేయడంతో ఆమె కూడా గొప్ప పేరు తెచ్చుకున్న వీరవనితగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది నిస్వార్ధంగా కుటుంబాన్ని సైతం పోరాటంలో భాగం చరిత్ర అతనికి సొంతం రామచంద్రారెడ్డి నాయకత్వన్న 4,500 మంది తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని అమరత్వం పొందారని వారి త్యాగాల వల్లే నైజాం నవాబు గత్యంతరం లేక భారత ప్రభుత్వానికి లొంగి పోవాల్సి వచ్చింది.
నేడు ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే ఆరుట్ల దంపతులు చేసిన త్యాగాల వల్లే అని ప్రజలు గుర్తుంచుకోవాల్సిన రోజు వర్ధంతి సందర్భంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆలేరు నియోజకవర్గంలో జన్మించడం ఆయనతో పాటు ఈ ప్రాంతానికి ప్రజల్లో గొప్ప పేరు తెచ్చింది.ఆలేరు నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే పోటీ చేసిన వారి స్మరించుకుంటూ ఓట్లు అడుక్కునే పరిస్థితిలో నేటికీ ఉండడం వారి గొప్పతనానికి నిదర్శనం. ఆరుట్ల రామచంద్ర రెడ్డి కమలాదేవి తుపాకి చేతబట్టి నైజాం రజాకార్లను గడగడలాడించి వెన్నులో వణుకు పుట్టించారు.
వారే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా నేడు ఆరుట్ల ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు విద్య అందిస్తూ కంప్యూటర్ శిక్షణ ఇస్తూ కుట్లు అల్లికలు నేర్పిస్తూ ఉచితంగా కుట్టుమిషన్లు ఇచ్చి ఉపాధి కల్పిస్తూ క్రీడలలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు క్రీడ పోటీలు నిర్వహించడం అభినందనీయం వారి వర్ధంతి నాడు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నైజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం నేడు పాలిక పాలకులు వక్రీకరిస్తూ హిందూ ముస్లింల మధ్య పోరాటంగా చిత్రీకరించి చరిత్రను తప్పు తోవ పట్టించే ప్రయత్నాన్ని ప్రజలు తెలుసుకోవాలి.ఈ సందర్భంగా ఆలేరు ఆణిముత్యాలుగా పేరుపొందిన ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి లను మననం చేసుకోవడం వారు కోరుకున్న దోపిడి లేని సమా సమాజం రావాలని ఆశిద్దాం.