నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
జిల్లాలో గంజాయిని సమూలంగా రూపుమార్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏఎస్పీ సురేందర్ రావు తెలిపారు. గురువారం గంజాయి కమిటీ ఆధ్వర్యంలో గంజాయి దహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 18 కేసుల్లో పట్టుబడిన 41 కిలోల 918 గ్రాముల గంజాయిని నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి వద్ద శ్రీమెడికేర్ సర్వేసెస్ సెంటర్ వద్ద దహనం చేశారు. ఇందులో 21.057 కిలోల గంజాయి మొక్కలు, 20.861 కిలోల ఎండు గంజాయి ఉన్నట్టు ఏఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎవరైన గంజాయి సాగు చేసిన, రవాణ చేసిన, సేవించిన కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయిని దహనం చేయడం జరిగిందన్నారు. ఆయనతో పాటు డీసీఆర్బీ ఎస్సై హకీం, సిబ్బంది ఉన్నారు.
41 కిలోల గంజాయి దహనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES