- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పడకల గ్రామ శివారులో గల శ్రీ మెడికేర్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో గల బయో మెడికల్ వేస్టేజ్ లో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 11 పోలీస్ స్టేషన్ పరిధిలో గల దాదాపు 410 కేజీల ఎండు గంజాయి సీజ్ చేసినటువంటి దానిని సోమవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అడిషనల్ డీసీపీ (అడ్మిన్) జి. బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీబీ రాజా వెంకట్ రెడ్డి, సి. సి. ఆర్. బి ఇన్స్పెక్టర్ రమేష్, సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు, ఎస్సైలు, బయో మెడికల్ వేస్టేజ్ సర్వీసెస్ ఎం.డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



