-మత్స్యకారుల దినోత్సవంలో మండలాధ్యక్షుడు పోచయ్య
నవతెలంగాణ – బెజ్జంకి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మత్స్య పారిశ్రామిక శాఖ సంఘం మండలాధ్యక్షుడు అక్కరవేణీ పోచయ్య ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం వద్ద ముదిరాజ్ సంఘ జెండాను పోచయ్య ఎగురవేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని పోచయ్య ప్రభుత్వాన్ని కోరారు. మత్స్య పారిశ్రామిక శాఖ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
బేగంపేటలో..
మండల పరిధిలోని బేగంపేట గ్రామంలోని బస్టాండ్ అవరణం వద్ద ముధిరాజ్ సంఘ నాయకులు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ముదిరాజ్ జెండాను ఎగురవేశారు.



