Wednesday, November 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంస్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

- Advertisement -

– టీఎస్‌ఆర్‌ఎల్‌డీ నేత, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌
నవతెలంగాణ-కరీంనగర్‌

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం చట్టబద్దమైన రిజర్వేషన్లను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని హౌటల్‌ స్వేత కన్వెన్షన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు. ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఐక్యతతోనే బహుజన రాజకీయాధికారం సాధ్యపడుతుందని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలనీ, రాబోయే ఎన్నికల్లో యువతకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సీట్లను కేటాయించేందుకు ఆర్‌ఎల్‌డీ కట్టుబడి ఉందన్నారు. అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. విద్య, వైద్య, ఉపాధి వంటి కీలక రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. కనీసం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చే యడం, 28 లక్షల వృత్తినైపుణ్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అయినా పూర్తిగా విఫలమైందన్నారు. రైతుల ఆదాయానికి భద్రత కోసం పంటల బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు. వైపరిత్యాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు బియ్యాల కృష్ణ, యాదాద్రిభువనగిరి జిల్లా అధ్యక్షులు గేర బీరప్ప, ప్రధాన కార్యదర్శులు మడకం ప్రసాద్‌ దొర, రిషబ్‌, నరసింహరావు, బుల్లెట్‌ వెంకన్న, కళా బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -