డీసీసీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ళ శివకుమార్
నవతెలంగాణ – ఏర్గట్ల
బీసీలకు విద్యా,ఉద్యోగాలలో,రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డీసీసీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ళ శివకుమార్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ… బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి, పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి, చట్టం తేవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టి ,56 శాతం బీసీ కులవర్గాలు ఉన్నట్లు తేల్చిందని గుర్తుచేశారు. ఇందులో భాగంగా అసెంబ్లీ తీర్మానం చేసి ఆర్డినెన్స్ కోసం గవర్నర్ కు పంపిందని, ఆ బిల్లును గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టారని అన్నారు.
ఇదే విషయమై మొన్న బుధవారం చలో ఢిల్లీ పేరట జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ నుండి చాలా మంది బీసీలము ధర్నాలో పాల్గొన్నామని తెలిపారు. బీజేపీ పాలిత ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ లో అన్ని కులాలకు,మతాలకు సమాన వాటా ప్రకారం అవకాశాలు కల్పిస్తున్నట్లే ,తమకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని కోరారు.తమిళనాడు రాష్ట్రంలో అంతా ఒక్కటై 69 శాతం రిజర్వేషన్ సాధించుకున్నట్లు గుర్తుచేశారు.
బీసీ రిజర్వేషన్ పట్ల బీఆర్ఎస్ పార్టీ ద్వంద వైఖరి మానుకోవాలని సూచించారు.ఏ పార్టీలైన,ఏ నాయకులైన బీసీ వర్గాలకు ద్రోహం చేయాలని చూస్తే వారిని బీసీ ద్రోహులుగా పరిగణిస్తామని హెచ్చరించారు.భావితరాల కోసం బీసీలు అందరూ ఒక్కటి కావాలని ఆయన పిలుపునిచ్చారు.సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రేండ్ల రాజారెడ్డి, గడ్డం జీవన్, బొర్రన్న, పన్నాల నర్సారెడ్డి, జుంగల గణేష్, కొలిప్యాక రవి,ఈరపట్నం చిన్న భూమన్న, ఓర్సు రాములు, కుమ్మరి సహదేవ్, దండేవోయిన సాయికుమార్, కల్లెడ పురుషోత్తం, మురళి గౌడ్, మునిమాణిక్యం అజయ్, చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కల్పించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES