Tuesday, July 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం 

బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం 

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరండ్ల సంతోష్
నవతెలంగాణ – పరకాల 
: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం పట్ల పరకాల పట్టణంలోని మూడో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మూడవ వార్డుల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వార్డ్ ఇన్చార్జి పోరండ్ల సంతోష్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈసీ రిజర్వేషన్లు సమర్ధిస్తూ పరకాల పట్టణ మూడో వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని పట్టం కట్టడం జరుగుతుందన్నారు.

 బిజెపి, టిఆర్ఎస్ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేయునట్లు వివరించారు. కులాల వారీగా ఉద్యోగస్తులను, విద్యార్థులను, మహిళా గ్రూపులను కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సోషల్ మీడియా మండల్ కోఆర్డినేటర్ శివకుమార్,వార్డు అధ్యక్షులు పొరండ్ల ప్రశాంత్, సిపిఐ నాయకులు ఆలేటి ఉపేందర్, మాదారపు సూర్యప్రతాప్, బోయిని తిరుపతి, పురంశట్టి శివకుమార్, వేముల శ్రీను, పట్టాభి దినేష్, అఖిల్, తోట శివ, వంశీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -