- సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ: బీసీ లకు రాష్ట్రంలో అన్ని రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌లో భాగంగా నిజామాబాద్ నగరంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ద్వారకానగర్ నుండి బస్టాండ్ , రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల పాపయ్య మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా బీసీలు అత్యధిక జనాభా ఉండి కూడా రిజర్వేషన్ ఫలాలను అందుకోలేకపోతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 9ను స్వాగతిస్తున్నామని, గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న బీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం బిల్లులను అడ్డుకోవటం సరైంది కాదని, బీసీలు అందరూ బీజేపీ ద్వంద వైఖరికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య,సిపిఐ ఎంఎల్ నగర కార్యదర్శి నీలం సాయిబాబా, IFTU నగర అధ్యక్ష కార్యదర్శులు మల్లికార్జున్, శివకుమార్, నగర కమిటీ సభ్యులు రమేష్, సత్యం, మోహన్, నర్సింగ్ రావు,పి డి ఎస్ యూ నాయకులు జన్నారపు రాజేశ్వర్,మనోజ్, సాయి కిరణ్, ప్రసాద్, రైతు కూలి సంఘం నాయకులు చిన్నయ్య,ఎర్రన్న, PYL నాయకులు బండమీద నర్సయ్య, భాస్కర్ తదితదిరులు పాల్గొన్నారు.