Friday, September 19, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ ఎన్నికలకు ముందు 42 వేల ఓట్లు తొలగింపు

ఢిల్లీ ఎన్నికలకు ముందు 42 వేల ఓట్లు తొలగింపు

- Advertisement -

ఈసీపై ఆప్‌ ఆరోపణలు
న్యూఢిల్లీ : ఈ ఏడాదిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 42 వేల ఓట్లను ఈసీ తొలగించిందని ఆప్‌ ఆరోపించింది. ప్రధానంగా ఆప్‌ ఓటర్లను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని, ప్రొఫైలింగ్‌ తరువాత ఈ ఓట్లను తొలగించారని పేర్కొంది. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆప్‌ ఢిల్లీ చీఫ్‌ సౌరభ్‌ భరద్వాజా ఈ ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్‌ నియోజకవర్గం న్యూఢిల్లీలో ఈ ఓట్ల తొలగింపు జరిగిందని భరద్వాజ్‌ తెలిపారు. ‘ఈరోజు రాహుల్‌ గాంధీ చెబుతున్నది. ఢిల్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ చెప్పారు’ అని అన్నారు. గతేడాది డిసెంబరు 29న జరిగిన విలేకరుల సమావేశం కేజ్రీవాల్‌ చేసిన విమర్శలను భరద్వాజ్‌ గుర్తు చేశారు. ఆ సమావేశంలో సామూహికంగా ఓట్ల తొలగింపు, చేరికను చూపించే డేటాను కేజ్రీవాల్‌ ప్రదర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -