రష్యా సంచలన నిర్ణయం
మాస్కో : ప్రముఖ మెసేజింగ్ యాప్‌ల్లో ఒకటైన టెలిగ్రామ్‌పై 4,32,366 డాలర్ల భారీ జరిమానాను రష్యా ప్రభుత్వం విధించింది. ప్రభుత్వం ఆదేశించినా నిషేధిత కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు ఈ భారీ జరిమానా విధించినట్లు రష్యా వార్తా సంస్థ ఇంటర్‌ఫాక్స్ సోమవారం వెల్లడించింది. చట్టవిరుద్ధమైన, ఉగ్రవాద కంటెంట్‌ను టెలిగ్రామ్ అనుమతిస్తుందని, దీన్ని తొలగించాలని రష్యా అధికారులు పదేపదే విజ్ఞప్తి చేసినా ఆ సంస్థ తిరస్కరించిందని ఇంటర్‌ఫాక్స్ తెలిపింది. ఈ జరిమానా వార్తలపై టెలిగ్రామ్ కూడా స్పందించింది. రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మ్యాక్స్ అనే యాప్‌కు ప్రజలను బలవంతంగా మార్చడానికి తమపై ఈ ఆరోపణలు చేస్తున్నారని టెలిగ్రామ్ పేర్కొంది. తమపై నిషేధిత కంటెంట్ ఆరోపణలను తిరస్కరించింది.
టెలిగ్రామ్ యాప్‌పై 4,32,366 డాలర్ల జరిమానా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



