Wednesday, March 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమధ్యప్రాచ్యం యుద్ధంతో ఆకలి కోరల్లోకి 4.5 కోట్ల మంది

మధ్యప్రాచ్యం యుద్ధంతో ఆకలి కోరల్లోకి 4.5 కోట్ల మంది

- Advertisement -

డబ్ల్యూఎఫ్‌పీ నివేదిక
జెనీవా :
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ల యుద్ధం జూన్‌ వరకూ కొనసాగితే.. మరో పది కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆకలిని ఎదుర్కొంటారని ప్రపంచ ఆహార కార్యక్రమం (వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌- డబ్ల్యూఎఫ్‌పీ) నివేదించింది. ఈ నివేదిక సమాచారం ప్రకారం… ఫిబ్రవరి 26న ఇరాన్‌పై ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు, కీలకమైన మానవతా సహాయ మార్గాలను స్తంభింపజేశాయి. దీనితో ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సంక్షోభ ప్రాంతాలకు ప్రాణరక్షక సహాయం చేరడం ఆలస్యమైంది. ఆహారం, చమురు, రవాణా ఖర్చులు పెరగడంతో అదనంగా 4.5 కోట్ల మంది తీవ్ర ఆకలిలోకి నెట్టబడతారని అంచనా. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య ప్రస్తుత రికార్డుస్థాయి 3.1 కోట్ల నుంచి పైకి వెళ్తుందని డబ్ల్యూఎఫ్‌పీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కార్ల్‌ స్కావ్‌ జెనీవాలో విలేకరులతో అన్నారు. ”ఇది ప్రపంచ ఆకలి స్థాయిలను సర్వకాలిక రికార్డు కు తీసుకువెళ్తుంది. ఇది చాలా భయంకరమైన పరిణామం” అని ఆయన అన్నారు. ”ఈ యుద్ధానికి ముందే, మనం ఒక సంక్షోభ పరిస్థితిలో ఉన్నాం. అయితే ఆకలి ఇంత తీవ్రంగా ఎప్పుడూ లేదు. సంఖ్యా పరంగా చూస్తే.. ఆకలి తీవ్రత పరంగా కూడా ఇది చాలా పెద్ద విషయం” అని ఆయన చెప్పారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి రవాణా ఖర్చులు 18 శాతం పెరిగాయనీ, కొన్నింటిని దారి మళ్లించాల్సి వచ్చిందని స్కావ్‌ చెప్పారు. దాతలు రక్షణ రంగంపై ఎక్కువ దృష్టి సారిస్తుండటంతో డబ్ల్యూఎఫ్‌పీ తన ఖర్చులలో భారీ కోతలు విధించింది. దానికి తోడు ఈ అదనపు ఖర్చులు కూడా వచ్చిపడ్డాయని ఆయన చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -