- Advertisement -
హైదరాబాద్: ఈ నెల 13 నుంచి బెంగళూర్‌లో జరుగనున్న జాతీయ పికిల్‌బాల్ చాంపియన్‌షిప్స్‌కు తెలంగాణ నుంచి 46 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. తెలంగాణ బందానికి రాష్ట్ర నం.1 ర్యాంక్ ప్యాడ్లర్ సమీర్ వర్మ సారథ్యం వహించనున్నాడు. ఈ పోటీల్లో పాల్గొనే తెలంగాణ బందం అధికారిక జెర్సీని రాష్ట్ర క్రీడాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ సచివాలయంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పికిల్‌బాల్ సంఘం కార్యదర్శి, ఒలింపియన్ విష్ణు వర్దన్, ఆ సంఘం ఆఫీస్‌బేరర్లు పాల్గొన్నారు.
- Advertisement -


