Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈనెల 25న 4వ జిల్లా మహాసభలు 

ఈనెల 25న 4వ జిల్లా మహాసభలు 

- Advertisement -

కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు దండేంపల్లి శ్రీనివాస్
నవతెలంగాణ – కట్టంగూరు
ఈనెల 25న తెలంగాణ కళ్ళుగీత కార్మిక సంఘం 4వ జిల్లా మహాసభలను చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు. మహాసభలకు సంబంధించిన కరపత్రాలను గురువారం మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.రాష్ట్ర కల్లుగీత కార్పోరేషన్ కు ప్రభుత్వం 5వేల కోట్లు బడ్జెట్ కేటాయించాలని, ప్రతి సొసైటికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని ఉన్న 560 జిబో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కల్లులోని పోషకాలను, ఔషద గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలని,నీరా, తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ప్రతి జిల్లాకేంద్రంలో నెలకొల్పాలని, గౌడ యువతి యువకులకు ఉపాధి కల్పించాలని,తాటి, ఈత, ఖర్జూర హైబ్రిడ్ మొక్కలను ఉచితంగా ఇచ్చి నీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. వృత్తిలో ఎక్కడ ప్రమాదానికి గురై చనిపోయిన వారి కుటుంబాలకు, శాశ్వత వికలాంగులకు 10 లక్షలు, తాత్కాలిక వికలాంగులకు లక్ష చొప్పున ఎక్స్రేషియా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మద శ్రీను, గౌరవ అధ్యక్షులు చౌగోనీ లింగయ్య, ఉపాధ్యక్షులు పనస యాదయ్య, ఆకుల శంకరయ్య, ఉపాధ్యక్షులు సురిగి సత్తయ్య, సహాయ కార్యదర్శి వేముల సైదులు, కోశాధికారి నీలం అంజయ్య,అనంతుల నర్సింహ్మ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -