పెన్షన్ రూ.6000కు పెంచాలి ఈనెల 25న కలెక్టరేట్ల ముట్టడి
12న దేశవ్యాప్త సమ్మెకు మద్దతు : ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో వికలాంగుల సంక్షేమనికి 5 శాతం నిధులు కేటాయించాలనీ, పెన్షన్ రూ.6,000లకు పెంచి వెంటనే అమలు చేయాలనే డిమాండ్లతో ఫిబ్రవరి 25న దేశ వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయల ముట్టడి నిర్వహి స్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర ప్రధానకార్యదర్శి యం.అడివయ్య తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యాలయంలో ఆ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం కేంద్ర కమిటీ సభ్యులు ఆర్.వెంకటేష్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి అడివయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వికలాంగుల సంక్షేమనికి రూ.1,669. 72 కోట్లు మాత్రమే కేటాయించి నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టె బడ్జెట్‌లో వికలాంగుల సంక్షేమనికి నిధుల కేటాయింపు పెంచాలని డిమాండ్ చేశారు. చేయూత పెన్షన్స్ పెంపు కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించి, పెన్షన్స్ పెంచాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 26 నెలలు పూర్తవుతున్నప్పటికీ పెన్షన్స్ పెంచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగులకు సహాయ పరికరాల పంపిణి కోసం లబ్ధిదారుల జాబితాలు తయారు అయ్యాక కూడా ఎందుకు పరికరాలు పంపిణి చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన పరికరాలు పూర్తిస్థాయిలో పంపిణి చేయకుండానే 2025-26 ఆర్థిక సంవత్సరనికి దరఖాస్తులు స్వీకరించడం సరైంది కాదని సూచించారు.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను గుర్తించి వెంటనే భర్తీ చేయాలని అడివయ్య డిమాండ్ చేశారు. వీబీజీరామ్‌జీ బిల్లు రద్దు చేసి నరేగా చట్టాన్ని కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలో వికలాంగు లపై దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని అరికట్టెందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న సమ్మెలో ప్రత్యక్షంగా వికలాంగులంతా పాల్గొనాలని ఆయన పిలుపు నిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం వికలాం గులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు యశోద, కాషాప్ప, అరిఫా, సహాయ కార్యదర్శులు కె.నాగలక్ష్మి రాష్ట్ర కమిటీ సభ్యులు శశికల, చంద్రమోహన్, భాగ్యలక్ష్మి, దుర్గ, నర్సిములు, చెన్నయ్య, షాహిన్ బేగం, రామకృష్ణ, బంగారయ్య, బిచ్చమ్మ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
బడ్జెట్‌లో వికలాంగుల సంక్షేమానికి 5 శాతం నిధులు కేటాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



