- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్రమంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలం పక్కనున్న 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరారు. పాలన సౌలభ్యం కోసం 5 గ్రామాలను భద్రాచలంలో కలపాలని, ఆ గ్రామాలను కలిపితేనే గిరిజనుల సమస్యలు తొలగుతాయని విజ్ఞప్తి చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే నిర్ణయం తీసుకునేలా చూడాలని లేఖలో కోరారు.
- Advertisement -



