నవతెలంగాణ – కుభీర్
మండలంలోని ఫార్డి (కే )గ్రామానికి చెందిన దొంతుల రాజేందర్ బుధవారం విట్టళేశ్వర ఆలయానికి 50 ప్లేట్లను విరాళంగా అందజేశారు. వాటి విలువ సుమారు రూ.6000 వరకు ఉంటుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెల లో ఏకాదశి రోజున గ్రామంలో ఉన్న విట్టళేశ్వర్ ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్లాస్టిక్ పేపర్లు, కవర్లతో కూడిన పేపర్లలో భోజనం చేస్తే అనేక రకాలుగా వ్యాధులు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తన సొంత ఖర్చులతో 50 స్టీల్ ప్లేట్లను విరాళంగా అందించానని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు, స్థానిక సర్పంచ్, గ్రామస్తులు తదితరులున్నారు.
విటళేశ్వర ఆలయానికి 50 ప్లేట్లు విరాళం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



