Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసీపీగెట్‌లో 51,317 మంది ఉత్తీర్ణత

సీపీగెట్‌లో 51,317 మంది ఉత్తీర్ణత

- Advertisement -
  • అమ్మాయిలు 32,743 మంది, అబ్బాయిలు 18,573 మంది అర్హత
  • రేపటినుంచి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ : ఉన్నత విద్యామండలి వి బాలకిష్టారెడ్డి

    నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

    కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీపీగెట్‌)-2025 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ఎం కుమార్‌ సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎనిమిది విశ్వవిద్యాలయాల్లో 51 సబ్జెక్టుల్లో ప్రవేశాలకు గతనెల నాలుగు నుంచి 11 వరకు రాతపరీక్షలు జరిగాయని చెప్పారు. సీపీగెట్‌కు 62,806 మంది దరఖాస్తు చేశారనీ, వారిలో 54,692 మంది పరీక్షలు రాశారని వివరించారు. పరీక్షలకు హాజరైన వారిలో 51,317 (93.83 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని అన్నారు. ఇందులో 40,241 మంది అమ్మాయిలు దరఖాస్తు చేయగా, 35,095 మంది పరీక్షలు రాశారని చెప్పారు. వారిలో 32,743 (93.3 శాతం) మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించారని అన్నారు. 22,564 మంది అబ్బాయిలు దరఖాస్తు చేస్తే 19,596 మంది పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. వారిలో18,573 (94.78 శాతం) మంది అబ్బాయిలు, ఇతరులు ఒకరు అర్హత సాధించారని చెప్పారు. గత విద్యాసంవత్సరంలో ఎనిమిది విశ్వవిశ్వవిద్యాలయాల పరిధిలో 278 కాలేజీల్లో వివిధ పీజీ కోర్సుల్లో 42,192 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. బుధవారం నుంచి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. బుధవారం నుంచి ఈనెల 15 వరకు అర్హులైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని చెప్పారు. ఈనెల 18 నుంచి 20 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశముందని అన్నారు. 24న సీట్లు కేటాయిస్తామని వివరించారు. ఈనెల 27 నాటికి కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఈనెల 29 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇతర వివరాల కోసం షషష.శీరఎaఅఱa.aష.ఱఅ, షజూస్త్రవ్‌.్‌రషష్ట్రవ.aష.ఱఅ, షషష.శీబaసఎఱరరఱశీఅర.షశీఎ వెబ్‌సైట్లను సంప్రదించాలని సూచించారు. విద్యార్థులందరూ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు విద్యార్హతకు సంబంధించినవి పత్రాలను సిద్ధం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్‌కే మహమూద్‌, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌, కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, మహిళా వర్సిటీ వీసీ సూర్యధనుంజరు, సీపీగెట్‌ కన్వీనర్‌ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad