రూ.3,593 కోట్లను విద్యుత్ సంస్థలకు చెల్లించాం : శాసనమండలిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు లబ్దిదారులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శాసనమండలిలో సభ్యురాలు విజయశాంతి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. రాష్ట్రంలోని 52,82,498 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3,593.17 కోట్లను విద్యుత్ సంస్థలకు చెల్లించిందని వివరించారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో 25,35,560 లక్షల మంది, ఎన్పీడీసీఎల్ పరిధిలో 27,46,938 లక్షల మంది ఉన్నారని తెలిపారు. బీజేపీ సభ్యులు ఏవీఎన్ రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 18వ తారీఖున కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఒకటో తేదీన జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఆర్థిక భారాన్ని వాయిదా వేసేందుకు ఉద్యోగుల ప్రయోజనాలు చెల్లించకుండా రిటైర్మెంట్ వయోపరిమితిని మూడేండ్లు గత ప్రభుత్వం పెంచిందని డిప్యూటీ సీఎం అన్నారు. ”వయోపరిమితి పెంచకుంటే 2021 నుంచి 2023 మధ్య సంవత్సరాల్లో 26,854 మంది ఉద్యోగ విరమణ పొందే వారనీ, పెంపుతో కేవలం 6,354 మంది మాత్రమే రిటైర్ అయ్యారు. మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ బెనిఫిట్స్ రూ.1,752 కోట్లు చెల్లించాం. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 6,244 కోట్లు ఉన్నాయనీ, వాటిని క్లియర్ చేసేందుకు ప్రతి నెలా రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నాం” అని తెలిపారు. ఉద్యోగుల మెటర్నిటీ, చైల్డ్ కేర్ లీవ్‌ల పెంపుపై పీఆర్సీ నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
‘గృహజ్యోతి’తో 52.82 లక్షల మందికి లబ్ది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



