Thursday, April 9, 2026
E-PAPER
HomeNews56వ ఎన్‌ఎస్‌యుఐ ఆవిర్భావ దినోత్సవం..హాస్పిటల్‌లో పండ్లు పంపిణీ

56వ ఎన్‌ఎస్‌యుఐ ఆవిర్భావ దినోత్సవం..హాస్పిటల్‌లో పండ్లు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి: ఎన్‌ఎస్‌యుఐ(NSUI) దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఎన్‌ఎస్‌యుఐ జిల్లా ఉపాధ్యక్షులు నోముల తరుణ్ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళపెల్లి శ్రీవాణి రవికుమార్ మాట్లాడారు. విద్యా రంగంలో పారదర్శకత, సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోందన్నారు. విద్యార్థుల ఫీజు సమస్యలు, స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై ఉద్యమాలు చేపడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తోందన్నారు. ఎన్‌ఎస్‌యుఐ నాయకులు నోముల కమల్, జానకి రామ్, రాకేష్ ఆకాష్, రామ్, చరణ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -