Thursday, January 29, 2026
E-PAPER
Homeఖమ్మంరెండో రోజు 58 నామినేషన్ లు దాఖలు 

రెండో రోజు 58 నామినేషన్ లు దాఖలు 

- Advertisement -

– అధికంగా బీఆర్ఎస్ నామినేషన్ లు 22
నవతెలంగాణ – అశ్వారావుపేట

మున్సిపాల్టీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ స్వీకరణ రెండో రోజు గురువారం అశ్వారావుపేట లో 22 వార్డులకు 56 మంది కౌన్సిలర్ అభ్యర్ధులు నుండి 58 నామినేషన్ లు అందినట్లు ఎన్నికల జిల్లా సహాయ అధికారి,అశ్వారావుపేట కమీషనర్ బి.నాగరాజు తెలిపారు. మొదటి రోజు బుధవారం 22 వార్డులకు ముగ్గురు కౌన్సిలర్ అభ్యర్ధులు నుండి మూడు నామినేషన్ లు అందాయని,గత రెండు రోజులకు మొత్తం 56 మంది నుండి 58 నామినేషన్ లు దాఖలు అయ్యాయని తెలిపారు.

ఇందులో బీఆర్ఎస్ నుండి 22, ఐ.ఎన్.సీ(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) నుండి 18,ఏడీ ఆర్పీ(అలయన్స్ డెమోక్రటిక్ రిసోర్స్ పార్టీ) నుండి 7,ఇండిపెండెట్స్(స్వతంత్రులు) నుండి 6,బీజేపీ నుండి 6,సీపీఐ(ఎం) నుండి 2,ఆర్ఎల్డీ (రాష్ట్రీయ లోక్ దళ్ ) నుండి 1 చొప్పున మొత్తం 58 నామినేషన్ లు అందినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -