– జెండా ఆవిష్కరించిన నాయకులు
నవతెలంగాణ-రామారెడ్డి
61వ లియఫి ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయంలోజెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు. శాఖ అధ్యక్షులు నారాయణరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమం లో జాతీయ నాయకులు కిషోర్ చంద్ బుధవారం మాట్లాడుతూ.. ఎల్ఐసి ఏజెంట్ల ప్రాముఖ్యతతో పాటు, పాలసీదారుల ప్రయోజనాల కోసం లియఫి పనిచేస్తుందని అన్నారు. నారాయణరావు మాట్లాడుతూ… సమస్యల పరిష్కారం కోసం ఏజెంట్లంతా ఐక్యంగా ఉండాలని, ప్రతి సమస్యపై కలిసికట్టుగా పోరాడుదామని సూచించారు.
లియఫి ఏర్పడి 61 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. లియఫి చరిత్రలో ఏజెంట్లతోపాటు పాలసీదారుల సమస్యలను పరిష్కరించిన చరిత్ర ఉందని, పాలసీలపై జిఎస్టి రద్దు చేయాలని ఏజెంట్ల పోరాట ఫలితమే జీఎస్టీ రద్దయిందని అన్నారు.కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ కృష్ణమోహన్, కార్యాలయ సిబ్బంది శ్రీధర్,నాయకులు కొండ బైరయ్య, మోహన్, మోహన్ రెడ్డి, ప్రదీప్ జైన్, ఉమాపతి, రామ్ శెట్టి శేఖర్, శంకర్, సత్యనారాయణ, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.